Check out the new design

ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ * - មាតិកានៃការបកប្រែ


ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អ៊ីព្រហ៊ីម   វាក្យខណ្ឌ:
وَاٰتٰىكُمْ مِّنْ كُلِّ مَا سَاَلْتُمُوْهُ ؕ— وَاِنْ تَعُدُّوْا نِعْمَتَ اللّٰهِ لَا تُحْصُوْهَا ؕ— اِنَّ الْاِنْسَانَ لَظَلُوْمٌ كَفَّارٌ ۟۠
మరియు మీరు ఆయనతో అడిగినవన్ని,ఆయనతో అడగనివి ఆయన మీకు ప్రసాధించాడు. మరియు ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రరహాలను లెక్కించినా అవి అధికముగా ,ఎక్కువగా ఉండటం వలన మీరు వాటిని లెక్కించజాలరు. అయితే మీకు తెలియపరచిన ఈ కొన్ని ఉదాహరణల్లోంచివి. నిశ్చయంగా మానవుడు తన స్వయం పై దుర్మార్గమునకు పాల్పడేవాడును,మహోన్నతుడైన పరిశుద్ధుడైన అల్లాహ్ అనుగ్రహాలను ఎక్కువగా నిరాకరించేవాడును.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَاِذْ قَالَ اِبْرٰهِیْمُ رَبِّ اجْعَلْ هٰذَا الْبَلَدَ اٰمِنًا وَّاجْنُبْنِیْ وَبَنِیَّ اَنْ نَّعْبُدَ الْاَصْنَامَ ۟ؕ
ఓ ప్రవక్తా నేను ఇబ్రాహీం కుమారుడు ఇస్మాయీల్ మరియు అతని తల్లి హాజిరాను మక్కా లోయలో నివాసం కలిగించిన తరువాత ఆయన ఇలా పలకినప్పటి సంఘటనను మీరు గుర్తు చేసుకోండి : ఓ నా ప్రభువా నేను నా ఇంటి వారిని నివాసంగా ఏర్పరచిన ఈ నగరము మక్కాను ఇందులో ఎటువంటి రక్తపాతము లేకుండా,ఇందులో ఎవరు దుర్మార్గమునకు పాల్పడకుండా నీవు శాంతి గల నగరముగా చేయి. మరియు నీవు నన్ను,నా సంతానమును విగ్రహారాధన నుండి దూరంగా ఉంచు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
رَبِّ اِنَّهُنَّ اَضْلَلْنَ كَثِیْرًا مِّنَ النَّاسِ ۚ— فَمَنْ تَبِعَنِیْ فَاِنَّهٗ مِنِّیْ ۚ— وَمَنْ عَصَانِیْ فَاِنَّكَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఓ నా ప్రభువా నిశ్చయంగా ఈ విగ్రహాలు చాలా మంది ప్రజలు వాటిని తమ కొరకు సిఫారసు చేస్తాయని భావించినప్పుడు అవి వారిని అపమార్గమునకు గురి చేశాయి. వారు వాటి ద్వారా పరీక్షించబడ్డారు. వారు అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించారు. అయితే ఎవరైతే అల్లాహ్ ఏకత్వము విషయంలో,ఆయనకు విధేయత చూపటంలో నన్ను అనుసరిస్తాడో నిశ్చయంగా అతను నా వర్గములోంచివాడు మరియు నన్ను అనుసరించిన వారిలోంచి వాడు. మరియు ఎవరైతే నా పై అవిధేయత చూపి ఆయన ఏకత్వం విషయంలో,ఆయనపై విధేయత చూపటంలో నన్ను అనుసరించడో ఓ నా ప్రభువా నిశ్చయంగా నీవు కోరిన వారి పాపములను మన్నించదలచుకుంటే మన్నించేవాడివి,వారిపై కనికరించేవాడివీ నీవే.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
رَبَّنَاۤ اِنِّیْۤ اَسْكَنْتُ مِنْ ذُرِّیَّتِیْ بِوَادٍ غَیْرِ ذِیْ زَرْعٍ عِنْدَ بَیْتِكَ الْمُحَرَّمِ ۙ— رَبَّنَا لِیُقِیْمُوا الصَّلٰوةَ فَاجْعَلْ اَفْىِٕدَةً مِّنَ النَّاسِ تَهْوِیْۤ اِلَیْهِمْ وَارْزُقْهُمْ مِّنَ الثَّمَرٰتِ لَعَلَّهُمْ یَشْكُرُوْنَ ۟
ఓ నా ప్రభువా నిశ్చయంగా నేను నా సంతానములో కొందరైన ఇస్మాయీలు,అతని కుమారులను నీ పవిత్ర గృహం దగ్గర ఎటువంటి పంటపొలాలు లేని,ఎటువంటి నీరు లేని ఒక లోయలో ( అది మక్కా ప్రాంతం) నివాసమేర్పరచాను. ఓ మా ప్రభువా అక్కడ వారు నమాజు నెలకొల్పడం కొరకు దాని దగ్గర నేను వారిని నివాసమేర్పరచాను. ఓ నా ప్రభువా అయితే నీవు ప్రజల హృదయాలను వారి వైపునకు ఈ నగరం వైపునకు ఆకర్షింపజేయి (మరల్చు).మరియు నీవు వారిపై అనుగ్రహించిన వాటి గురించి నీకు వారు కృతజ్ఞతలు తెలుపుకుంటారని ఆశిస్తూ వారికి ఫలాలను జీవనోపాధిగా ప్రసాధించు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
رَبَّنَاۤ اِنَّكَ تَعْلَمُ مَا نُخْفِیْ وَمَا نُعْلِنُ ؕ— وَمَا یَخْفٰی عَلَی اللّٰهِ مِنْ شَیْءٍ فِی الْاَرْضِ وَلَا فِی السَّمَآءِ ۟
ఓ మా ప్రభువా నిశ్చయంగా నీవు మేము గోప్యంగా ఉంచే ప్రతీ దాన్ని మరియు మేము బహిరంగ పరచే ప్రతీ దాన్ని తెలుసుకుంటావు. మరియు భూమిలో కాని ఆకాశములో కాని అల్లాహ్ పై ఏదీ గోప్యంగా ఉండదు. కాని ఆయన వాటిని తెలుసుకుంటాడు. అయితే ఆయన యందు మన అవసరము,మన పేదరికం గోప్యంగా ఉండదు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْ وَهَبَ لِیْ عَلَی الْكِبَرِ اِسْمٰعِیْلَ وَاِسْحٰقَ ؕ— اِنَّ رَبِّیْ لَسَمِیْعُ الدُّعَآءِ ۟
నాకు నీతిమంతులను అనుగ్రహించమని నా ప్రార్ధనను స్వీకరించిన ఆ అల్లాహ్ కు కృతజ్ఞతలు,స్థుతులు. అప్పుడు ఆయన నాకు నా వృద్ధాప్యంలో కూడా హాజరతో ఇస్మాయీలును,సారాతో ఇస్హాఖ్ ను ప్రసాధించాడు. నిశ్చయంగా పరిశుద్ధుడైన నా ప్రభువు తనను అర్ధించే వారి అర్ధనలను ఆలకిస్తాడు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
رَبِّ اجْعَلْنِیْ مُقِیْمَ الصَّلٰوةِ وَمِنْ ذُرِّیَّتِیْ ۖۗ— رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ ۟
ఓ నా ప్రభువా నీవు నన్ను పరిపూర్ణ రీతిలో నమాజును పాటించేవాడిగా చేయి. నా సంతానమును కూడా అలాగే దాన్ని పాటించేవారిగా చేయి. ఓ మా ప్రభువా నీవు నా ప్రార్ధనను స్వీకరించు మరియు దాన్ని నీ వద్ద స్వీకరించబడేటట్లు చేయి.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
رَبَّنَا اغْفِرْ لِیْ وَلِوَالِدَیَّ وَلِلْمُؤْمِنِیْنَ یَوْمَ یَقُوْمُ الْحِسَابُ ۟۠
ఓ మా ప్రభువా నీవు నా పాపములను మన్నించు. మరియు నా తండ్రి పాపములను మన్నించు. (తన తండ్రి అల్లాహ్ కు బద్ధ శతృవు అని తనకు తెలవక ముందు పలికిన మాటలు ఇవి.ఎప్పుడైతే అతను అల్లాహ్ కు శతృవు అని అతనికి స్పష్టమైనదో ఆయన అతని నుండి విసుగును చూపారు). మరియు ప్రజలు తమ ప్రభువు ముందు తమ లెక్క తీసుకోవటం కొరకు నిలబడే రోజున విశ్వాసపరుల కొరకు వారి పాపములను మన్నించు.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
وَلَا تَحْسَبَنَّ اللّٰهَ غَافِلًا عَمَّا یَعْمَلُ الظّٰلِمُوْنَ ؕ۬— اِنَّمَا یُؤَخِّرُهُمْ لِیَوْمٍ تَشْخَصُ فِیْهِ الْاَبْصَارُ ۟ۙ
ఓ ప్రవక్తా అల్లాహ్ దుర్మార్గుల శిక్షకు గడువు ఇచ్చినప్పుడు ఆయన దుర్మార్గులు పాల్పడే కార్యాలైన తిరస్కారము,అల్లాహ్ మార్గము నుండి ఆపటం మరియు ఇతర వాటి నుండి నిర్లక్ష్యంగా ఉన్నాడని మీరు భావించకండి. కాని ఆయనకు అవి తెలుసు. వాటిలోంచి ఏది కూడా ఆయనకు గోప్యంగా ఉండదు. ఆయన మాత్రం వారి శిక్షకు ప్రళయ దినం వరకు గడువు ఇస్తున్నాడు. ఆ రోజు కళ్ళు తాము చూసిన భయానక పరిస్థితుల నుండి భయం వలన పైకి లేస్తాయి.
ការបកស្រាយជាភាសា​អារ៉ាប់:
អំពី​អត្ថប្រយោជន៍​នៃវាក្យខណ្ឌទាំងនេះនៅលើទំព័រនេះ:
• بيان فضيلة مكة التي دعا لها نبي الله إبراهيم عليه الصلاة والسلام.
అల్లాహ్ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం దేని కొరకైతే దుఆ చేశారో ఆ మక్కా ప్రాముఖ్యత ప్రకటన.

• أن الإنسان مهما ارتفع شأنه في مراتب الطاعة والعبودية ينبغي له أن يخاف على نفسه وذريته من جليل الشرك ودقيقه.
మనిషి తాను విధేయత,దాస్యత యొక్క స్థానాల్లో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా తనపై,తన సంతానముపై ఘోరమైన షిర్క్ నుండి సున్నితమైన షిర్క్ నుండి భయపడాలి.

• دعاء إبراهيم عليه الصلاة والسلام يدل على أن العبد مهما ارتفع شأنه يظل مفتقرًا إلى الله تعالى ومحتاجًا إليه.
ఒక దాసుడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అతడు అల్లాహ్ అవసరం కలవాడని ,అతని వైపు కొరవడిందని ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ప్రార్ధన సూచిస్తుంది.

• من أساليب التربية: الدعاء للأبناء بالصلاح وحسن المعتقد والتوفيق في إقامة شعائر الدين.
సంస్కరణ గురించి,మంచి విశ్వాసము గురించి,ధర్మం యొక్క ఆచారాలు నిర్వహించే అనుగ్రహం గురించి పిల్లల కొరకు ప్రార్ధన చేయటం క్రమశిక్షణ యొక్క విధానాల్లోంచిది.

 
ការបកប្រែអត្ថន័យ ជំពូក​: អ៊ីព្រហ៊ីម
មាតិកានៃជំពូក លេខ​ទំព័រ
 
ការបកប្រែអត្ថន័យនៃគម្ពីរគួរអាន - ការអធិប្បាយសង្ខេបអំពីគម្ពីគួរអានជាភាសាតេលេគូ - មាតិកានៃការបកប្រែ

ត្រូវបានចេញដោយមជ្ឈមណ្ឌល តាហ្វសៀរនៃការសិក្សាគម្ពីគួរអាន

បិទ