Check out the new design

કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ * - ભાષાંતરોની અનુક્રમણિકા


શબ્દોનું ભાષાંતર સૂરહ: અસ્ સોફ્ફાત   આયત:
یَّقُوْلُ ءَاِنَّكَ لَمِنَ الْمُصَدِّقِیْنَ ۟
అతడు నాతో తిరస్కరిస్తూ,హేళన చేస్తూ ఇలా పలికేవాడు : ఓ మిత్రమా ఏమీ నీవు మృతులు మరల లేపబడటమును నమ్మేవారిలోంచివా ?.
અરબી તફસીરો:
ءَاِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَّعِظَامًا ءَاِنَّا لَمَدِیْنُوْنَ ۟
ఏమీ మేము మరణించి మట్టిగా,కృశించిపోయిన ఎముకలుగా మారిపోయినప్పుడు మేము మరలలేపబడుతామా మరియు మేము ఇహలోకంలో చేసిన మా కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతామా ?.
અરબી તફસીરો:
قَالَ هَلْ اَنْتُمْ مُّطَّلِعُوْنَ ۟
విశ్వాసపరుడైన అతని మితృడు స్వర్గవాసులైన తన మితృలతో ఇలా పలుకుతాడు : ఏమీ మరణాంతరం లేపబడటమును తిరస్కరించిన స్నేహితుడి పరిణామమును మేము చూడటానికి మీరు నాతోపాటు తొంగి చూస్తారా ?.
અરબી તફસીરો:
فَاطَّلَعَ فَرَاٰهُ فِیْ سَوَآءِ الْجَحِیْمِ ۟
అప్పుడు అతను తొంగి చూస్తాడు. తన స్నేహితుడిని నరకం మధ్యలో చూస్తాడు.
અરબી તફસીરો:
قَالَ تَاللّٰهِ اِنْ كِدْتَّ لَتُرْدِیْنِ ۟ۙ
అతడు ఇలా పలుకుతాడు : అల్లాహ్ సాక్షిగా ఓ నా మిత్రమా నీవు నన్ను అవిశ్వాసము,మరణాంతరము లేపబడటము వైపు నీ పిలుపు ద్వారా నన్ను నరకములో ప్రవేశింపజేసి నాశనం చేసి ఉండేవాడివే.
અરબી તફસીરો:
وَلَوْلَا نِعْمَةُ رَبِّیْ لَكُنْتُ مِنَ الْمُحْضَرِیْنَ ۟
ఒక వేళ నాపై విశ్వసము కొరకు మార్గదర్శకము,దాని సౌభాగ్యము ద్వారా అల్లాహ్ అనుగ్రహమే లేకపోతే నీలాగా నేనూ శిక్ష వైపు హాజరు అయ్యేవారిలో నుంచి అయిపోయేవాడిని.
અરબી તફસીરો:
اَفَمَا نَحْنُ بِمَیِّتِیْنَ ۟ۙ
అయితే మేము - స్వర్గవాసులు - మరణించము.
અરબી તફસીરો:
اِلَّا مَوْتَتَنَا الْاُوْلٰی وَمَا نَحْنُ بِمُعَذَّبِیْنَ ۟
ఇహలోకములోని మన మొదటి మరణం తప్ప. అంతే కాదు మేము స్వర్గంలో శాశ్వతంగా ఉంటాము. మరియు అవిశ్వాసపరులు శిక్షింపబడినట్లు మేము శిక్షింపబడము.
અરબી તફસીરો:
اِنَّ هٰذَا لَهُوَ الْفَوْزُ الْعَظِیْمُ ۟
నిశ్ఛయంగా మా ప్రభువు మాకు ప్రతిఫలంగా ప్రసాదించిన స్వర్గములో ప్రవేశము,అందులో శాశ్వత నివాసము,నరకాగ్ని నుండి భద్రత గొప్ప సాఫల్యము. దానికి సరితూగే ఎటువంటి సాఫల్యము లేదు.
અરબી તફસીરો:
لِمِثْلِ هٰذَا فَلْیَعْمَلِ الْعٰمِلُوْنَ ۟
ఇటువంటి గొప్ప సాఫల్యము కొరకు ఆచరించే వారు ఆచరించటం తప్పనిసరి. నిశ్ఛయంగా ఇదే లాభదాయకమైన వ్యాపారము.
અરબી તફસીરો:
اَذٰلِكَ خَیْرٌ نُّزُلًا اَمْ شَجَرَةُ الزَّقُّوْمِ ۟
తన విధేయత కొరకు ప్రత్యేకించుకున్న తన దాసుల కొరకు అల్లాహ్ సిద్ధం చేసి ఉంచినటువంటి ఈ ప్రస్తావించబడిన అనుగ్రహాలు స్థానమును బట్టి,ఆతిధ్యమును బట్టి మేలైనవా,గొప్పవా లేదా ఖుర్ఆన్ లో దూషించబడినటువంటి జముడు చెట్టు ఏదైతే అవిశ్వాసపరుల ఆహారమో అది లావు చేయదు,ఆకలినీ తీర్చదు అది (మేలైనదా).
અરબી તફસીરો:
اِنَّا جَعَلْنٰهَا فِتْنَةً لِّلظّٰلِمِیْنَ ۟
నిశ్ఛయంగా మేము ఈ వృక్షమును ఒక పరీక్షగా చేశాము. దాని ద్వారా అవిశ్వాసముతో,పాపకార్యములతో దుర్మార్గులైనవారు పరీక్షింపబడుతారు. అందుకనే వారు ఇలా పలికారు : నిశ్ఛయంగా అగ్ని వృక్షములను తినివేస్తుంది. అందులో అవి మొలకెత్తటం అసంభవం.
અરબી તફસીરો:
اِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِیْۤ اَصْلِ الْجَحِیْمِ ۟ۙ
నిశ్ఛయంగా జముడు చెట్టు ఒక ప్రాణాంతక చెట్టు. అది నరకము యొక్క లోతు నుండి వెలికి వచ్చే వృక్షము.
અરબી તફસીરો:
طَلْعُهَا كَاَنَّهٗ رُءُوْسُ الشَّیٰطِیْنِ ۟
దాని నుండి వాటి ఫలములు వెలికి వచ్చే భయంకర దృశ్యము షైతానుల తలలవలె ఉంటాయి. దృశ్యం యొక్క వికారము సమాచారము ఇచ్చేవారి వికారమునకు సూచన. మరియు ఇది అంటే దాని ఫలములు రుచిలో చెడ్డవని అర్ధం.
અરબી તફસીરો:
فَاِنَّهُمْ لَاٰكِلُوْنَ مِنْهَا فَمَالِـُٔوْنَ مِنْهَا الْبُطُوْنَ ۟ؕ
అయితే అప్పుడు అవిశ్వాసపరులు చేదైన,వికారమైన దాని పండ్లను తింటారు. తమ ఖాళీ కడుపులను దానితో నింపుకుంటారు.
અરબી તફસીરો:
ثُمَّ اِنَّ لَهُمْ عَلَیْهَا لَشَوْبًا مِّنْ حَمِیْمٍ ۟ۚ
నిశ్ఛయంగా వారు దాని నుండి తిన్న తరువాత వారి కొరకు వికారమైన వేడి మిశ్రమ పానియం ఉంటుంది.
અરબી તફસીરો:
ثُمَّ اِنَّ مَرْجِعَهُمْ لَاۡاِلَی الْجَحِیْمِ ۟
ఆ తరువాత నిశ్ఛయంగా దాని తరువాత వారి మరలింపు మండే అగ్నిశిక్ష వైపుకు అవుతుంది. అప్పుడు వారు ఒక శిక్ష నుండి ఇంకో శిక్ష వైపునకు మరలుతారు.
અરબી તફસીરો:
اِنَّهُمْ اَلْفَوْا اٰبَآءَهُمْ ضَآلِّیْنَ ۟ۙ
నిశ్ఛయంగా ఈ అవిశ్వాసపరులందరు తమ తాతముత్తాతలను సన్మార్గము నుండి తప్పిపోయినవారిగా పొందుతారు. వారు వారిని నమూనాగా చేసుకున్నది అనుకరణగా మాత్రమే, ఎటువంటి ఆధారపరంగా కాదు.
અરબી તફસીરો:
فَهُمْ عَلٰۤی اٰثٰرِهِمْ یُهْرَعُوْنَ ۟
అప్పుడు వారు తమ తాతముత్తాతల అడుగుజాడలోనే మర్గభ్రష్టతలో తొందరపడుతూ అనుసరించారు.
અરબી તફસીરો:
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ اَكْثَرُ الْاَوَّلِیْنَ ۟ۙ
వాస్తవానికి వారికి మునుపు చాలా మంది పూర్వికులు పెడదారి పట్టి ఉన్నారు. ఓ ప్రవక్తా జాతుల్లోంచి మొదట పెడదారిన పడినది మీ జాతి కాదు.
અરબી તફસીરો:
وَلَقَدْ اَرْسَلْنَا فِیْهِمْ مُّنْذِرِیْنَ ۟
మరియు నిశ్చయంగా మేము ఆ మొదటి జాతుల వారిలో ప్రవక్తలను పంపించాము.వారు వారిని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టేవారు. అప్పుడు వారు తిరస్కరించారు.
અરબી તફસીરો:
فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُنْذَرِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా ఆ జాతుల ముగింపు ఎవరినైతే వారి ప్రవక్తలు హెచ్చరిస్తే వారు వారిని స్వీకరించలేదో ఏమయిందో మీరు చూడండి. నిశ్ఛయంగా వారి అవిశ్వాసం వలన,వారి ప్రవక్తలను వారు తిరస్కరించటం వలన వారి ముగింపు నరకాగ్నిలో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశమయింది.
અરબી તફસીરો:
اِلَّا عِبَادَ اللّٰهِ الْمُخْلَصِیْنَ ۟۠
అల్లాహ్ తనపై విశ్వాసమునకు ప్రత్యేకించుకున్నవారు తప్ప. నిశ్ఛయంగా వారు తిరస్కారులైన అవిశ్వాసపరులందరి ముగింపు ఏదైతో జరిగినదో ఆ శిక్ష నుండి ముక్తి పొందేవారయ్యారు.
અરબી તફસીરો:
وَلَقَدْ نَادٰىنَا نُوْحٌ فَلَنِعْمَ الْمُجِیْبُوْنَ ۟ؗۖ
మరియు నిశ్ఛయంగా మన ప్రవక్త నూహ్ అలాహిస్సలాం తనును తిరస్కరించిన తన జాతి వారిపై బద్దుఆ (శపించినప్పుడు) చేసినప్పుడు మమ్మల్నే వేడుకున్నాడు. మేమే ఎంతో చక్కగా ప్రార్ధనలను అంగీకరించేవారము. నిశ్ఛయంగా మేము వారికి వ్యతిరేకంగా ఆయన ప్రార్దనను స్వీకరించటంలో తొందర చేశాము.
અરબી તફસીરો:
وَنَجَّیْنٰهُ وَاَهْلَهٗ مِنَ الْكَرْبِ الْعَظِیْمِ ۟ؗۖ
మరియు నిశ్ఛయంగా మేము అతనిని,అతని కుటుంబీకులని,అతనితోపాటు విశ్వసించినవారిని అతని జాతి వారి వేదింపుల నుండి,అవిశ్వాసపరులైన అతని జాతి వారిపై పంపించబడ్డ పెద్ద తూఫాను ద్వారా మునగటం నుండి రక్షించాము.
અરબી તફસીરો:
આયતોના ફાયદાઓ માંથી:
• الظفر بنعيم الجنان هو الفوز الأعظم، ولمثل هذا العطاء والفضل ينبغي أن يعمل العاملون.
స్వర్గవనాల అనుగ్రహాల ద్వారా సాఫల్యం అదే గొప్ప సాఫల్యము. ఇటువంటి ప్రసాదము,అనుగ్రహము కొరకే ఆచరించే వారు ఆచరించాలి.

• إن طعام أهل النار هو الزقّوم ذو الثمر المرّ الكريه الطعم والرائحة، العسير البلع، المؤلم الأكل.
నిశ్ఛయంగా నరకవాసుల ఆహారము అసహ్యకరమైన రుచి,వాసన కల ఫలములు కల,మింగటానికి కష్టమైన,తినటానికి బాధాకరమైన జముడు మొక్క.

• أجاب الله تعالى دعاء نوح عليه السلام بإهلاك قومه، والله نعم المقصود المجيب.
మహోన్నతుడైన అల్లాహ్ నూహ్ అలైహిస్సలాంయొక్క ఆయన జాతిని నాశనం చేయమని చేసిన దుఆను స్వీకరించాడు. మరియు అల్లాహ్ ఎంతో బాగా సంకల్పించుకోదగినవాడు,స్వీకరించేవాడు.

 
શબ્દોનું ભાષાંતર સૂરહ: અસ્ સોફ્ફાત
સૂરહ માટે અનુક્રમણિકા પેજ નંબર
 
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર - તેલુગુ ભાષામાં અલ્ મુખ્તસર ફી તફસીરિલ્ કુરઆનીલ્ કરીમ કિતાબનું અનુવાદ - ભાષાંતરોની અનુક્રમણિકા

તફસીર લિદ્ દિરાસતીલ્ કુરઆનિયહ કેન્દ્ર દ્વારા પ્રકાશિત.

બંધ કરો