Check out the new design

Firo maanaaji Alqur'aana Teddunde nden - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. * - Loowdi firooji ɗi


Firo maanaaji Simoore.: Simoore Sad   Aaya.:
وَمَا خَلَقْنَا السَّمَآءَ وَالْاَرْضَ وَمَا بَیْنَهُمَا بَاطِلًا ؕ— ذٰلِكَ ظَنُّ الَّذِیْنَ كَفَرُوْا ۚ— فَوَیْلٌ لِّلَّذِیْنَ كَفَرُوْا مِنَ النَّارِ ۟ؕ
మరియు మేము ఆకాశమును,భూమిని వృధాగా సృష్టించలేదు. ఇది అవిశ్వాసపరుల భ్రమ మాత్రమే. ఈ విధమైన భ్రమను కలిగి ఉండే అవిశ్వాసపరులందరి కొరకు వారు తమ అవిశ్వాస స్థితిలోనే మరణించి,అల్లాహ్ పట్ల చెడుగా భావిస్తే ప్రళయదినాన నరకాగ్ని శిక్ష నుండి వినాశనం కలుగును.
Tafsiraaɗe Aarabu ɗen:
اَمْ نَجْعَلُ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ كَالْمُفْسِدِیْنَ فِی الْاَرْضِ ؗ— اَمْ نَجْعَلُ الْمُتَّقِیْنَ كَالْفُجَّارِ ۟
మేము అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను అనుసరించి,సత్కర్మలను చేసిన వారిని అవిశ్వాసముతో,పాపకార్యములతో భూమిపై చెడును ప్రభలించిన వారికి సమానులుగా చేయము. మరియు మేము తమ ప్రభువుపై ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి భీతి కలిగిన వారిని పాపకార్యముల్లో మునిగి ఉండే అవిశ్వాసపరులు,కపటవిశ్వాసుల మాదిరిగా చేయము. నిశ్ఛయంగా వారి మధ్య సమానత అన్యాయమవుతుంది. అది పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ కు తగదు. కాని అల్లాహ్ దైవభీతి కలిగిన విశ్వాసపరులని స్వర్గములో ప్రవేశింపజేయటం ద్వారా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు దుష్టులైన అవిశ్వాసపరులని నరకములో ప్రవేశింపజేసి శిక్షిస్తాడు. ఎందుకంటే వారు అల్లాహ్ వద్ద సమానులు కాజాలరు. అలాగే ఆయన వద్ద వారి ప్రతిఫలము కూడా సమానం కాజాలదు.
Tafsiraaɗe Aarabu ɗen:
كِتٰبٌ اَنْزَلْنٰهُ اِلَیْكَ مُبٰرَكٌ لِّیَدَّبَّرُوْۤا اٰیٰتِهٖ وَلِیَتَذَكَّرَ اُولُوا الْاَلْبَابِ ۟
నిశ్ఛయంగా ఈ ఖుర్ఆన్ మేము మీ వైపునకు అవతరింపజేసిన ఒక గ్రంధం చాలా మేళ్ళు,ప్రయోజనాలు కలిగి ఉన్నది. ప్రజలు వాటి ఆయతుల్లో యోచన చేయటానికి, వాటి అర్దములలో యోచన చేయటానికి. మరియు దాని ద్వారా ప్రకాశవంతమైన,సరైన బుద్ధి కలవారు హితబోధన గ్రహించటానికి.
Tafsiraaɗe Aarabu ɗen:
وَوَهَبْنَا لِدَاوٗدَ سُلَیْمٰنَ ؕ— نِعْمَ الْعَبْدُ ؕ— اِنَّهٗۤ اَوَّابٌ ۟ؕ
మరియు మేము దావూద్ కు అతని కుమారుడగు సులైమాన్ ను మా వద్ద నుండి ఆయనపై అనుగ్రహముగా,సౌభాగ్యముగా దాని ద్వారా ఆయన కంటిచలువ కొరకు ప్రసాదించాము. సులైమాన్ అలైహిస్సలాం ఎంతో మంచి దాసుడు. నిశ్చయంగా ఆయన ఎక్కువగా పశ్చాత్తాప్పడేవాడు మరియు అల్లాహ్ వైపునకు మరలేవాడు. మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపముతో మరలే వాడు.
Tafsiraaɗe Aarabu ɗen:
اِذْ عُرِضَ عَلَیْهِ بِالْعَشِیِّ الصّٰفِنٰتُ الْجِیَادُ ۟ۙ
మీరు ఆయనపై వేగవంతమైన మేలురకమైన గుర్రములు సాయంకాలం ప్రవేశపెట్టబడినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. అవి మూడు కాళ్ళపై నిలబడి నాలుగవ కాలును ఎత్తి ఉన్నవి. సూర్యుడు అస్తమించేవరకు ఈ మేలు జాతి గుర్రములు అతనిపై ప్రవేశపెట్టబడుతూ ఉన్నవి.
Tafsiraaɗe Aarabu ɗen:
فَقَالَ اِنِّیْۤ اَحْبَبْتُ حُبَّ الْخَیْرِ عَنْ ذِكْرِ رَبِّیْ ۚ— حَتّٰی تَوَارَتْ بِالْحِجَابِ ۟۫
అప్పుడు సులైమాన్ అలైహిస్సలాం ఇలా పలికారు : నిశ్ఛయంగా నేను నా ప్రభువు స్మరణపై సంపదను ఇష్టపడటముపై ప్రాధాన్యతనిచ్చాను. అందులో నుంచి ఈ గుర్రములు. చివరికి సూర్యుడు అస్తమించాడు. మరియు నేను అసర్ నమజ్ ను ఆలస్యంగా చేశాను.
Tafsiraaɗe Aarabu ɗen:
رُدُّوْهَا عَلَیَّ ؕ— فَطَفِقَ مَسْحًا بِالسُّوْقِ وَالْاَعْنَاقِ ۟
ఈ గుర్రాలను మళ్ళీ నా వద్దకు తీసుకుని రండి (అని. సులైమాన్ అలైహిస్సలాం అన్నారు). వాటిని ఆయన వద్దకు మరల తీసుకుని రావటం జరిగింది. అప్పుడు ఆయన ఖడ్గముతో వాటి పిక్కలపై మరియు వాటి మెడలపై కొట్టసాగారు.
Tafsiraaɗe Aarabu ɗen:
وَلَقَدْ فَتَنَّا سُلَیْمٰنَ وَاَلْقَیْنَا عَلٰی كُرْسِیِّهٖ جَسَدًا ثُمَّ اَنَابَ ۟
మరియు నిశ్ఛయంగా మేము సులైమాన్ అలైహిస్సలాంను పరీక్షించాము. మరియు ఆయన రాజ్య సింహాసనంపై ఒక షైతానును పడవేశాము. అతడు మనిషి రూపంలో ఉన్నాడు ఆయన రాజ్యంలో కొంత కాలం ఏలాడు. ఆ తరువాత సులైమాన్ అలైహిస్సలాంకు ఆయన రాజ్యము తిరిగి వచ్చినది. షైతానులపై ఆయనకు ఆధిక్యత కలిగినది.
Tafsiraaɗe Aarabu ɗen:
قَالَ رَبِّ اغْفِرْ لِیْ وَهَبْ لِیْ مُلْكًا لَّا یَنْۢبَغِیْ لِاَحَدٍ مِّنْ بَعْدِیْ ۚ— اِنَّكَ اَنْتَ الْوَهَّابُ ۟
సులైమాన్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు నా పాపములను మన్నించు. మరియు నాకు ప్రత్యేకమైన సామ్రాజ్యమును ప్రసాదించు. అది నా తరువాత ప్రజల్లోంచి ఎవరికీ కలగకూడదు. ఓ నా ప్రభువా నీవు ఎక్కువగా అనుగ్రహించే వాడివి, గొప్ప ప్రధాతవి.
Tafsiraaɗe Aarabu ɗen:
فَسَخَّرْنَا لَهُ الرِّیْحَ تَجْرِیْ بِاَمْرِهٖ رُخَآءً حَیْثُ اَصَابَ ۟ۙ
అప్పుడు మేము ఆయన కొరకు స్వీకరించాము. మరియు మేము గాలిని ఆయన ఆదేశముకు అనుగుణంగా సుతిమెత్తగా వీచేటట్లుగా ఆయనకు ఆదీనంలో చేశాము. అందులో దాని బలముతో పాటు వేగమైన గాలి లేదు మరియు అది వీచటంలో వేగముగా లేదు. అది ఆయనను ఆయన కోరిన చోటుకు ఎత్తుకుని వెళుతుంది.
Tafsiraaɗe Aarabu ɗen:
وَالشَّیٰطِیْنَ كُلَّ بَنَّآءٍ وَّغَوَّاصٍ ۟ۙ
మరియు మేము ఆయన కొరకు ఆయన ఆదేశముకు అనుగుణంగా నడిచే జిన్నాతులను వశపరచాము. వారిలో నుండి కట్టడములను నిర్మించేవారున్నారు. మరియు వారిలో నుండి సముద్రంలో మునిగి దాని నుండి ముత్యాలను వెలికితీసే గజఈతగాళ్ళు ఉన్నారు.
Tafsiraaɗe Aarabu ɗen:
وَّاٰخَرِیْنَ مُقَرَّنِیْنَ فِی الْاَصْفَادِ ۟
జిన్నాతుల్లోంచి తలబిరుసు కలిగిన వారు ఆయనకు వశపరచబడినవి. వారు సంకెళ్ళలో బంధింపబడి ఉన్నారు.కదలలేరు.
Tafsiraaɗe Aarabu ɗen:
هٰذَا عَطَآؤُنَا فَامْنُنْ اَوْ اَمْسِكْ بِغَیْرِ حِسَابٍ ۟
ఓ సులైమాన్ ఇది మా అనుగ్రహము దేనినైతే నీవు మాతో కోరటం వలన మేము దాన్ని నీకు ప్రసాదించాము. అయితే నీవు తలచిన వారికి ఇవ్వు మరియు నీవు తలచిన వారికి ఇవ్వకు. ఇచ్చిన విషయంలో లేదా ఆపిన విషయంలో నీతో లెక్కతీసుకోబడదు.
Tafsiraaɗe Aarabu ɗen:
وَاِنَّ لَهٗ عِنْدَنَا لَزُلْفٰی وَحُسْنَ مَاٰبٍ ۟۠
మరియు నిశ్చయంగా సులైమాన్ అలైహిస్సలాం మా వద్ద సాన్నిద్యం పొందిన వారిలోంచి వారు. మరియు ఆయన కొరకు మంచి మరలే చోటు కలదు. అది స్వర్గము.
Tafsiraaɗe Aarabu ɗen:
وَاذْكُرْ عَبْدَنَاۤ اَیُّوْبَ ۘ— اِذْ نَادٰی رَبَّهٗۤ اَنِّیْ مَسَّنِیَ الشَّیْطٰنُ بِنُصْبٍ وَّعَذَابٍ ۟ؕ
ఓ ప్రవక్తా మీరు మా దాసుడగు అయ్యూబ్ తన ప్రభువైన అల్లాహ్ ను ఇలా వేడుకున్నప్పటి వైనమును గుర్తు చేసుకోండి : నిశ్ఛయంగా షైతాను నాకు అలసటను మరియు శిక్షను కలిగించాడు
Tafsiraaɗe Aarabu ɗen:
اُرْكُضْ بِرِجْلِكَ ۚ— هٰذَا مُغْتَسَلٌۢ بَارِدٌ وَّشَرَابٌ ۟
అప్పుడు మేము అతనితో ఇలా పలికాము : మీరు మీ కాలును నేలపై కొట్టండి. ఆయన తన కాలును నేలపై కొట్టారు. అప్పుడు దాని నుండి నీరు పొంగి వచ్టినది. ఆయన దాని నుండి త్రాగారు మరియు స్నానం చేశారు. అప్పుడు ఆయనకు ఉన్న కీడు మరియు బాధ తొలగిపోయింది.
Tafsiraaɗe Aarabu ɗen:
Hino jeyaa e nafooje Aayeeje on ka hello ɗoo.:
• الحث على تدبر القرآن.
ఖుర్ఆన్ లో యోచన చేయటం పై ప్రోత్సహించటం జరిగింది.

• في الآيات دليل على أنه بحسب سلامة القلب وفطنة الإنسان يحصل له التذكر والانتفاع بالقرآن الكريم.
హృదయ భద్రత మరియు మనిషి చతురతను బట్టి పవిత్ర ఖుర్ఆన్ ద్వారా అతని కొరకు హితోపదేశం గ్రహించటం మరియు ప్రయోజనం చెందటం లభిస్తుందని ఆయతుల్లో ఆధారం ఉన్నది.

• في الآيات دليل على صحة القاعدة المشهورة: «من ترك شيئًا لله عوَّضه الله خيرًا منه».
ఎవరైతే అల్లాహ్ కొరకు ఏదైన వస్తువును వదిలివేస్తే అల్లాహ్ అతనికి దానికన్న మంచి దాన్ని బదులుగా ప్రసాదిస్తాడు అన్న సుప్రసిద్ధ నియమం యొక్క ప్రామాణికతకు రుజువు ఆయతుల్లో ఉన్నది.

 
Firo maanaaji Simoore.: Simoore Sad
Loowdi cimooje ɗe Tonngoode hello ngon
 
Firo maanaaji Alqur'aana Teddunde nden - Eggo e haala Telgu wonande deftere Firo Alkur'aana raɓɓinaango. - Loowdi firooji ɗi

iwde e galle Firo jaŋdeeji Alkur'aana.

Uddu