Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-አንፋል   አንቀጽ:
اِذْ تَسْتَغِیْثُوْنَ رَبَّكُمْ فَاسْتَجَابَ لَكُمْ اَنِّیْ مُمِدُّكُمْ بِاَلْفٍ مِّنَ الْمَلٰٓىِٕكَةِ مُرْدِفِیْنَ ۟
మీరు మీ శతృవులపై విజయం ద్వారా అల్లాహ్ సహాయమును కోరుకున్నప్పటి బదర్ దినమును ఒక సారి గుర్తు చేసుకోండి. ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీకు సహాయం చేయటం ద్వారా,వెయ్యి మంది దైవ దూతలను కొందరి తరువాత కొందరు క్రమం తప్పకుండా వచ్చేటట్లు పంపించటం ద్వారా మీకు సహాయమును చేసి మీ దుఆను స్వీకరించాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَمَا جَعَلَهُ اللّٰهُ اِلَّا بُشْرٰی وَلِتَطْمَىِٕنَّ بِهٖ قُلُوْبُكُمْ ؕ— وَمَا النَّصْرُ اِلَّا مِنْ عِنْدِ اللّٰهِ ؕ— اِنَّ اللّٰهَ عَزِیْزٌ حَكِیْمٌ ۟۠
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ దైవదూతల ద్వారా సహాయమును మీ కొరకు శుభవార్తగా చేశాడు. ఎందుకంటే ఆయన మీ శతృవులపై మీకు సహాయమును (విజయమును) చేసే వాడును. సహాయము ద్వారా మీ మనస్సులు నమ్మకమును కలిగి సంతృప్తి చెందటం కొరకు. విజయం అన్నది సంఖ్యా బలం ఎక్కువగా ఉండటం వలన,యుద్ధ సామగ్రి (ఆయుధాలు) ఎక్కువగా ఉండటం వలన ప్రాప్తించదు. విజయం అన్నది పరిశుద్ధుడైన అల్లాహ్ తరపు నుండి ప్రాప్తిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్ తన ఆధిపత్యంలో ధీష్టుడు,ఆయనను ఎవరు ఓడించలేరు. తన ధర్మ శాస్త్రము,విధివ్రాత యందు వివేకవంతుడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِذْ یُغَشِّیْكُمُ النُّعَاسَ اَمَنَةً مِّنْهُ وَیُنَزِّلُ عَلَیْكُمْ مِّنَ السَّمَآءِ مَآءً لِّیُطَهِّرَكُمْ بِهٖ وَیُذْهِبَ عَنْكُمْ رِجْزَ الشَّیْطٰنِ وَلِیَرْبِطَ عَلٰی قُلُوْبِكُمْ وَیُثَبِّتَ بِهِ الْاَقْدَامَ ۟ؕ
ఓ విశ్వాసపరులారా మీకు మీ శతృవుల నుండి కలిగిన భయాందోళనల నుండి నిశ్చింతను ప్రసాదించటం కొరకు అల్లాహ్ మీపై నిద్ర మత్తును వేసినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. మరియు ఆకాశము నుండి మీ పై వర్షాన్ని కురిపించాడు. అశుద్ధతల నుండి మిమ్మల్ని పరిశుభ్ర పరచటానికి,మీ నుండి షైతాను దుష్రేరణలను దూరం చేయటానికి,దాని ద్వారా మీ హృదయాలకు దిటవు కలిగించటానికి యుద్ధ సమయంలో మీ శరీరములు నిలకడ చూపటానికి,దాని ద్వారా ఇసుక నేలను బిగుతువుగా చేసి పాదములకు స్థిరత్వాన్ని కలిగించి, చివరికి కాళ్ళు అందులో చిక్కిపోకుండా ఉండటానికి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِذْ یُوْحِیْ رَبُّكَ اِلَی الْمَلٰٓىِٕكَةِ اَنِّیْ مَعَكُمْ فَثَبِّتُوا الَّذِیْنَ اٰمَنُوْا ؕ— سَاُلْقِیْ فِیْ قُلُوْبِ الَّذِیْنَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوْا فَوْقَ الْاَعْنَاقِ وَاضْرِبُوْا مِنْهُمْ كُلَّ بَنَانٍ ۟ؕ
ఓ ప్రవక్తా మీ ప్రభువు బదర్ లో ముస్లిములకు సహాయంగా అల్లాహ్ ఏర్పాటు చేసిన దైవ దూతలను ఆదేశించినప్పటి ఆ సన్నివేశాన్ని ఒక సారి గుర్తు చేసుకోండి : ఓ దైవదూతలారా నిశ్చయంగా నేను సహాయము,మద్దతు ద్వారా మీకు తోడుగా ఉన్నాను. మీరు విశ్వాసపరుల ఉద్దేశాలను వారి శతృవులతో యుద్ధ విషయంలో బలోపేతం చేయండి. నేను తొందరలోనే అవిశ్వాసపరుల హృదయాల్లో తీవ్రమైన భయమును కలిగిస్తాను. ఓ విశ్వాసపరులారా మీరు అవిశ్వాసపరులను హతం చేయటానికి వారి మెడలపై కొట్టండి. వారు మీతో యుద్ధం నుండి వదిలి వెళ్ళిపోవటానికి వారి కీళ్ళపై,వారి వ్రేళ్ళ కణువులపై మీరు కొట్టండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ذٰلِكَ بِاَنَّهُمْ شَآقُّوا اللّٰهَ وَرَسُوْلَهٗ ۚ— وَمَنْ یُّشَاقِقِ اللّٰهَ وَرَسُوْلَهٗ فَاِنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ ۟
అవిశ్వాసపరులకి ఇలా జరగటం అంటే జతమారటం,వ్రేళ్ల కణువులపై కొట్డానికి కారణం వారు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విభేదించారు. వారికి ఆదేశించబడిన దానిని వారు పాటించ లేదు. వారికి వారించబడిన వాటిని మానలేదు. ఎవరైతే ఈ విషయంలో అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విభేదిస్తాడో అతనికి అల్లాహ్ ఇహలోకంలో హతమార్చటం,ఖైదీగా చేయటం ద్వారా,పరలోకంలో నరకాగ్ని ద్వారా కఠినమైన శిక్షకు గురి చేస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ذٰلِكُمْ فَذُوْقُوْهُ وَاَنَّ لِلْكٰفِرِیْنَ عَذَابَ النَّارِ ۟
ఓ అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విభేదించేవారా మీ కొరకు ఈ ప్రస్తావించబడిన శిక్ష ఇహలోక జీవితంలో అయితే మీరు తొందరగా దాని రుచిని చూడండి. మరియు ఒక వేళ మీరు మీ అవిశ్వాస స్థితిలో,విభేదించే స్థితిలో మరణిస్తే పరలోకంలో నరకాగ్ని శిక్ష మీ కొరకు కలదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا لَقِیْتُمُ الَّذِیْنَ كَفَرُوْا زَحْفًا فَلَا تُوَلُّوْهُمُ الْاَدْبَارَ ۟ۚ
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ప్రవక్తను అనుసరించే వారా మీరు యుద్ధంలో ముష్రికులను ఎదుర్కొని దగ్గరైనప్పుడు మీరు వారి నుండి పరాజయం పాలవకండి,మీ వెన్నులను త్రిప్పి పారిపోకండి. కాని మీరు వారికి అభిముఖమవ్వండి,వారితో యుద్ధంలో సహనం చూపండి. అల్లాహ్ తన సహాయము ద్వారా,మద్దతు ద్వారా మీకు తోడుగా ఉంటాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَمَنْ یُّوَلِّهِمْ یَوْمَىِٕذٍ دُبُرَهٗۤ اِلَّا مُتَحَرِّفًا لِّقِتَالٍ اَوْ مُتَحَیِّزًا اِلٰی فِئَةٍ فَقَدْ بَآءَ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَمَاْوٰىهُ جَهَنَّمُ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟
యుధ్ధ వ్యూహంగా వారిపై దాడిని కోరుకుంటూ పారిపోవటంను వారు భావించాలని వారితో యుధ్ధం కొరకు మడమ తిప్పటం కాకుండా లేదా ప్రత్యక్షమై ఉన్న ముస్లిముల ఒక వర్గముతో సహాయమును కోరుతూ వారిని కలవటానికి కాకుండా ఎవరైతే వారి నుండి పారిపోతూ వారికి తన వెన్ను చూపుతాడో అతడు అల్లాహ్ ఆగ్రహానికి లోనవుతాడు,దానికి హక్కుదారుడవుతాడు. అతని స్థానము పరలోకములో నరకమగును. అతని గమ్యస్థానము ఎంత చెడ్డదైన గమ్యస్థానమో,అతని మరలి వెళ్లే చోటు ఎంత చెడ్డదో.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• في الآيات اعتناء الله العظيم بحال عباده المؤمنين، وتيسير الأسباب التي بها ثبت إيمانهم، وثبتت أقدامهم، وزال عنهم المكروه والوساوس الشيطانية.
ఆయతుల్లో విశ్వాసపరులైన తన దాసుల స్థితి పట్ల అల్లాహ్ శ్రద్ద ,వారి విశ్వాసము స్థిరముగా ఉండటానికి.వారి పాదాలు స్థిరంగా ఉండటానికి,వారి నుండి ద్వేషము,షైతాను దుష్ప్రేరణలు దూరం అవటానికి కావలసిన కారకాల సులభతరం ఉన్నది.

• أن النصر بيد الله، ومن عنده سبحانه، وهو ليس بكثرة عَدَدٍ ولا عُدَدٍ مع أهمية هذا الإعداد.
నిశ్చయంగా సహాయం అన్నది అల్లాహ్ చేతిలో ఉన్నది,పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి కలుగుతుంది. అది (సహాయం) సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం వలన లేదా సిద్దం అవటం వలన కలగదు ఈ సిద్దం అవటం యొక్క అవసరం ఉన్నాకూడా.

• الفرار من الزحف من غير عذر من أكبر الكبائر.
ఎటువంటి కారణం లేకుండా యుధ్ధం నుండి పారిపోవటం మహా పాపాల్లోంచి ఒక మహా పాపము.

• في الآيات تعليم المؤمنين قواعد القتال الحربية، ومنها: طاعة الله والرسول، والثبات أمام الأعداء، والصبر عند اللقاء، وذِكْر الله كثيرًا.
ఆయతుల్లో విశ్వాసపరులకు యుధ్ధంలో పోరాట నియమాల బోధన ఉన్నది. అందులో నుండి అల్లాహ్ పై,ప్రవక్త పై విధేయత చూపటం,శతృవుల ముందు స్థిరత్వము,యుద్ధ సమయంలో సహనము,అల్లాహ్ స్మరణ ఎక్కువగా చేయటం.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-አንፋል
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት