Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-አዕራፍ   አንቀጽ:
وَالْبَلَدُ الطَّیِّبُ یَخْرُجُ نَبَاتُهٗ بِاِذْنِ رَبِّهٖ ۚ— وَالَّذِیْ خَبُثَ لَا یَخْرُجُ اِلَّا نَكِدًا ؕ— كَذٰلِكَ نُصَرِّفُ الْاٰیٰتِ لِقَوْمٍ یَّشْكُرُوْنَ ۟۠
మంచి నేల అల్లాహ్ ఆదేశానుసారం తన మొక్కలను మంచిగా పరిపూర్ణంగా వెలికి తీస్తుంది. మరియు ఇదేవిధంగా విశ్వాసపరుడు హితోపదేశమును వింటాడు,దాని ద్వారా ప్రయోజనం చెందుతాడు. అది (హితోపదేశం) సత్కర్మను ఉత్పత్తి చేస్తుంది. ఉప్పు నేల (సాల్ట్ మార్ష్నేల) తన మొక్కలను వెలికి తీయదు. కాని ఎటువంటి మేలు లేని కష్టాలను తీసుకుని వస్తుంది. మరియు ఇదే విధంగా అవిశ్వాసపరుడు హితోపదేశం ద్వారా ప్రయోజనం చెందడు. అతని వద్ద ఎటువంటి పుణ్యకార్యం దాని ద్వారా ప్రయోజనం పొందటానికి ఉత్పత్తి అవ్వదు. ఈ అద్భుతమైన వైవిధ్యీకరణ లాగే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను తిరస్కరించకుండా వాటి విషయంలో కృతజ్ఞత తెలుపుకుని,తమ ప్రభువు పై విధేయత చూపే వారి కొరకు మేము సత్యాన్ని నిరూపించటానికి రుజువులను,వాదనలను విస్తరిస్తాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
لَقَدْ اَرْسَلْنَا نُوْحًا اِلٰی قَوْمِهٖ فَقَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ ۟
నిశ్చయంగా మేము నూహ్ ను వారి జాతి వారి వైపునకు వారిని అల్లాహ్ ఏకత్వం వైపునకు,ఆయనను వదిలి ఇతరుల ఆరాధనను త్యజించటం వైపునకు పిలవటానికి ప్రవక్తగా పంపించాము. అయితే ఆయన వారితో ఇలా పలికారు : ఓ నాజాతి వారా మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన కాకుండా మీ కొరకు వేరొక సత్య ఆరాధ్య దైవం లేడు. ఓ నా జాతి వారా అవిశ్వాసంలో మీ మొండి వైఖరి స్థితిలో మీ పై ఒక మహా దినం నాటి శిక్ష గురించి నేను భయపడుతున్నాను.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ الْمَلَاُ مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰىكَ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ ۟
ఆయన జాతి నాయకులు,వారి పెద్దలు ఆయనకు ఇలా సమాధానమిచ్చారు : ఓ నూహ్ నిశ్చయంగా మేము మిమ్మల్ని సత్యం నుండి పూర్తి దూరంగా ఉన్నట్లు చూస్తున్నాము (భావిస్తున్నాను).
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ یٰقَوْمِ لَیْسَ بِیْ ضَلٰلَةٌ وَّلٰكِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟
నూహ్ తన జాతి పెద్దలతో ఇలా అన్నారు : మీరు అనుకుంటున్నట్లు నేను అపమార్గంలో లేను. నేను నా ప్రభువు తరపు నుండి సన్మార్గంపై ఉన్నాను. నేను నా ప్రభువు,మీ ప్రభువు,సర్వలోకాలందరి ప్రభువైన అల్లాహ్ తరపు నుండి మీ వద్దకు ప్రవక్తగా వచ్చాను.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اُبَلِّغُكُمْ رِسٰلٰتِ رَبِّیْ وَاَنْصَحُ لَكُمْ وَاَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
అల్లాహ్ మీ వద్దకు వహీ ద్వారా నాకు ఇచ్చి పంపించిన సందేశాలను మీకు చేరవేస్తున్నాను. నేను మీ కొరకు అల్లాహ్ యొక్క ఆదేశము పాటించటం,దానిపై ఏ పుణ్యము లభిస్తుందో మిమ్మల్ని ప్రోత్సహించటం ద్వారా,ఆయన వారించినవి,దాని పై ఏ శిక్ష లభిస్తుందో వాటికి పాల్పడటం నుండి మిమ్మల్ని భయపెట్టటం ద్వారా మేలును ఆశిస్తున్నాను. నాకు అల్లాహ్ సుబహానహు వతఆలా వద్ద నుండి నాకు ఆయన వహీ ద్వారా తెలిపినవి మీకు తెలియనివి విషయాలు నాకు తెలుసు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَوَعَجِبْتُمْ اَنْ جَآءَكُمْ ذِكْرٌ مِّنْ رَّبِّكُمْ عَلٰی رَجُلٍ مِّنْكُمْ لِیُنْذِرَكُمْ وَلِتَتَّقُوْا وَلَعَلَّكُمْ تُرْحَمُوْنَ ۟
మీలో నుంచే మీకు తెలిసిన ఒక వ్యక్తి నోట మీ ప్రభువు తరపు నుండి ఒక దైవ వాణి,హితబోధన మీ వద్దకు రావటం మీ ఆశ్చర్యమును పెంచినదా ?. అతడు మీలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. అతడు అబద్దపరుడు కాడు. దారి తప్పిన వాడును కాడు,అతడు వేరే జాతికి చెందిన వాడును కాడు. ఒక వేళ మీరు అతనిని తిరస్కరిస్తే,అతనిపై మీరు అవిధేయత చూపితే అల్లాహ్ యొక్క శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టడం కొరకు మీ వద్దకు వచ్చాడు. మీరు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భయభీతి కలిగి ఉండటం కొరకు మీ వద్దకు వచ్చాడు. ఒక వేళ మీరు అతనిని విశ్వసిస్తే మీరు కరుణించబడుతారని ఆశిస్తూ.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
فَكَذَّبُوْهُ فَاَنْجَیْنٰهُ وَالَّذِیْنَ مَعَهٗ فِی الْفُلْكِ وَاَغْرَقْنَا الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا ؕ— اِنَّهُمْ كَانُوْا قَوْمًا عَمِیْنَ ۟۠
అయితే అతని జాతి వారు అతనిని తిరస్కరించారు. అతనిపై విశ్వాసమును కనబరచలేదు. కాని తమ అవిశ్వాసంలో కొనసాగిపోయారు. అయితే అల్లాహ్ వారిని నాశనం చేయాలని అతడు శపించాడు. మేము ఆయనను,ఆయనతో పాటు నావలో ఉన్న విశ్వాసపరులను మునిగిపోకుండా రక్షించాము. మరియు మాఆయతులను తిరస్కరించి తమ తిరస్కారమును కొనసాగించిన వారిని వారిపై శిక్ష రూపంలో కురిసిన తుఫాను ద్వారా ముంచి మేము నాశనం చేసాము. నిశ్చయంగా వారి హృదయాలు సత్యం నుండి అంధులైపోయినవి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِلٰی عَادٍ اَخَاهُمْ هُوْدًا ؕ— قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ— اَفَلَا تَتَّقُوْنَ ۟
ఆద్ జాతి వారి వద్దకు వారిలోంచి ఒక ప్రవక్తను మేము పంపాము. ఆయనే హూద్ అలైహిస్సలాం. ఆయన (తన జాతి వారిని ఉద్దేశించి) ఇలా అన్నారు : ఓ నా జాతి వారా మీరు ఒకే అల్లాహ్ ను ఆరాధించండి. మీ కొరకు ఆయన తప్ప వేరే సత్య ఆరాధ్య దైవం లేడు. ఆయన శిక్ష నుండి మీరు సురక్షితంగా ఉండటం కొరకు ఆయన ఆదేశాలను పాటిస్తూ ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ మీరు ఆయనకు భయపడరా ?.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ الْمَلَاُ الَّذِیْنَ كَفَرُوْا مِنْ قَوْمِهٖۤ اِنَّا لَنَرٰىكَ فِیْ سَفَاهَةٍ وَّاِنَّا لَنَظُنُّكَ مِنَ الْكٰذِبِیْنَ ۟
అతని జాతి వారిలోంచి అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్తను తిరస్కరించిన నాయకులు,పెద్దవారు ఇలా అన్నారు : ఓ హూద్ నీవు ఎప్పుడైతే మమ్మల్ని ఒకే అల్లాహ్ ఆరాధన చేయటం,విగ్రహారాధనను విడనాడటం వైపునకు పిలిచావో మేము నిన్ను బుద్ది లేమి తనంలో,తెలివి తక్కువ తనంలో చూస్తున్నాము. నీవు ప్రవక్తగా పంపించబడ్డావన్న నీ వాదనలో నీవు అబద్దం చెబుతున్నావని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قَالَ یٰقَوْمِ لَیْسَ بِیْ سَفَاهَةٌ وَّلٰكِنِّیْ رَسُوْلٌ مِّنْ رَّبِّ الْعٰلَمِیْنَ ۟
హూద్ అలైహిస్సలాం తన జాతి వారిని ఖండిస్తూ ఇలా అన్నారు : ఓ నా జాతి వారా నాకు తెలివి లేకుండా లేదు,బుద్దిలేమి లేదు. కాని నేను సర్వలోకాల ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్తను.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الأرض الطيبة مثال للقلوب الطيبة حين ينزل عليها الوحي الذي هو مادة الحياة، وكما أن الغيث مادة الحياة، فإن القلوب الطيبة حين يجيئها الوحي، تقبله وتعلمه وتنبت بحسب طيب أصلها، وحسن عنصرها، والعكس.
మంచి సారవంతమైన నేల ఒక ఉదాహరణ, మంచి హృదయముల కొరకు వాటి పై జీవన ఆధారమైన వహీ (దైవ వాణి) వచ్చే వేళ, ఏ విధంగా నైతే వర్షం జీవన ఆధారమో ఆ విధంగా.ఎందుకంటే మంచి హృదయాలు వాటి వద్దకు దైవ వాణి వచ్చినప్పుడు దానిని అంగీకరిస్తాయి,దానిని తెలుసుకుంటాయి,వాటి మూలము మంచిగా ఉండే విధంగా పెరుగుతాయి. దానికి వ్యతిరేకమైతే విరుద్ధముగా.

• الأنبياء والمرسلون يشفقون على الخلق أعظم من شفقة آبائهم وأمهاتهم.
దైవప్రవక్తలు,సందేశహరులు మనుషులపై వారి తండ్రులకన్న,తల్లులకన్న ఎక్కువగా దయ చూపేవారై ఉంటారు.

• من سُنَّة الله إرسال كل رسول من قومه وبلسانهم؛ تأليفًا لقلوب الذين لم تفسد فطرتهم، وتيسيرًا على البشر.
ప్రతి ప్రవక్తను అతని జాతి వారిలోంచి.వారి భాషను తెలిసిన వాడిని వారిలోంచి స్వాభావిక పరంగా చెడ్డ వారు కాని వారి హృదయములను కలపటం కొరకు, మానవాళి పై సులభతరం చేయటం కొరకు పంపటం అల్లాహ్ సంప్రదాయం.

• من أعظم السفهاء من قابل الحق بالرد والإنكار، وتكبر عن الانقياد للعلماء والنصحاء، وانقاد قلبه وقالبه لكل شيطان مريد.
సత్యాన్ని నిరోధించటం,తిరస్కరించటం ద్వారా ఎదిరించిన వాడు,ధార్మిక పండితులను,ఉపదేశకులను అనుసరించటం నుండి గర్వాన్ని ప్రదర్శించిన వాడు,తన మనస్సును అనుసరించి దానిని ప్రతి అవిధేయుడైన షైతాను కొరకు మరల్చిన వాడు పెద్ద బుద్ది లేని వాడు.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-አዕራፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት