Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አን-ኒሳዕ   አንቀጽ:

అన్-నిసా

ከመዕራፉ ዓላማዎች:
تنظيم المجتمع المسلم وبناء علاقاته، وحفظ الحقوق، والحث على الجهاد، وإبطال دعوى قتل المسيح.
ముస్లిం సమాజాన్ని నిర్వహించడం, దాని సంబంధాలను నిర్మించడం, హక్కులను పరిరక్షించడం, జిహాద్ ను ప్రోత్సహించడం మరియు మసీహ్ అలైహిస్సలాం చంపబడ్డారనే వాదనను రద్దు చేయడం.

یٰۤاَیُّهَا النَّاسُ اتَّقُوْا رَبَّكُمُ الَّذِیْ خَلَقَكُمْ مِّنْ نَّفْسٍ وَّاحِدَةٍ وَّخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِیْرًا وَّنِسَآءً ۚ— وَاتَّقُوا اللّٰهَ الَّذِیْ تَسَآءَلُوْنَ بِهٖ وَالْاَرْحَامَ ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلَیْكُمْ رَقِیْبًا ۟
ఓ ప్రజలారా!మీ ప్రభువుకి భయపడండి,ఆయనే మిమ్మల్ని ఒక ప్రాణం నుండి సృష్టించాడు,ఆయనే మీ తండ్రి ఆదమ్,మరియు అతని నుండి తన భార్యని సృష్టించాడు,ఆమె మీ తల్లి హవ్వా!వారిరువురి ద్వారా భూమండలంకు నలువైపుల మగ,ఆడ మానవులను వ్యాపింపజేశాడు,మరియు మీరు అల్లాహ్ కు భయపడండి ఆయన పేరుతోనే మీరు ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు,మీరు ఇలా అంటారు:-అల్లాహ్ పేరుతో అడుగుతున్నాను నీవు ఇలా చేయి,మీ మధ్య జోడించబడిన బంధాలను తెగత్రెంపులు చేసుకోవడానికి భయపడండి’నిశ్చయంగా అల్లాహ్ ఎల్లప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు,మీ కర్మల నుండి ఏ విషయం వ్యర్ధమవ్వదు,బదులుగా వాటిని లెక్కించి ఉంచుతాడు మరియు వాటి ప్రతిఫలాన్ని మీకు ఇస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاٰتُوا الْیَتٰمٰۤی اَمْوَالَهُمْ وَلَا تَتَبَدَّلُوا الْخَبِیْثَ بِالطَّیِّبِ ۪— وَلَا تَاْكُلُوْۤا اَمْوَالَهُمْ اِلٰۤی اَمْوَالِكُمْ ؕ— اِنَّهٗ كَانَ حُوْبًا كَبِیْرًا ۟
మరియు ఇవ్వండి-ఓ సంరక్షకులారా-అనాథలకు (తమ తండ్రులను కోల్పోయిన యుక్తవయస్సుకు చేరని బాలకులు)వారి పూర్తి సంపదను,యుక్తవయస్సుకు చేరి వివేకులైన తరువాత,-మరియు ఆనాధాల యొక్క సంపదలో అత్యుత్తమ సొమ్మును మీరు తీసుకుని వారికి మీ హీనమైన చెడిపోయిన డబ్బును ఇస్తూ హరామును హలాలుగా మార్చుకోవద్దు.మరియు మీ డబ్బుతో కలిపి అనాధాల డబ్బును తీసుకోవద్దు,నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహాపెద్ద పాపం.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاِنْ خِفْتُمْ اَلَّا تُقْسِطُوْا فِی الْیَتٰمٰی فَانْكِحُوْا مَا طَابَ لَكُمْ مِّنَ النِّسَآءِ مَثْنٰی وَثُلٰثَ وَرُبٰعَ ۚ— فَاِنْ خِفْتُمْ اَلَّا تَعْدِلُوْا فَوَاحِدَةً اَوْ مَا مَلَكَتْ اَیْمَانُكُمْ ؕ— ذٰلِكَ اَدْنٰۤی اَلَّا تَعُوْلُوْا ۟ؕ
మరియు మీ సంరక్షణలో ఉన్న అనాథలను వివాహం చేసుకుంటే న్యాయం చేయలేరని మీరు భయపడినా లేదా వారికి తప్పనిసరిగా చెల్లించాల్సిన‘మహార్’మూల్యం చెల్లించే విషయంలో భయంకలిగిన లేదా వారి పట్ల దుర్వినియోగం జరుగుతుందనే భయం కలిగిన,వారిని వదిలేయండి,మరియు ఇతర ఉత్తమ స్త్రీలను ఎంచుకుని వివాహమాడండి,ఒకవేళ మీరు కోరితే ఇద్దరినీ,ముగ్గురిని,లేదా నలుగురిని వివాహమాడవచ్చు,కానీ వారిమధ్య న్యాయం చెయలేనని ఒకవేళ భయపడితే ‘ఒకరి’తో సరిపెట్టుకోండి,లేదా మీ అధికారంలో ఉన్న బానిస స్త్రీలతో కాపురంచేయండి, ఎందుకంటే వారికి మీ భార్యలతో పోలిన సమానమైన హక్కులు లేవు,ఈ ఆయతులో అనాథలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి మరియు ఒకరితో వివాహం లేదా బానిస-అమ్మాయి’తో తృప్తి చెందమని పరిమితి చేయబడింది, ఇది మీరు మోసపోకుండా మరియు నిషేధాలకు పాల్పడకుండా చేస్తుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَاٰتُوا النِّسَآءَ صَدُقٰتِهِنَّ نِحْلَةً ؕ— فَاِنْ طِبْنَ لَكُمْ عَنْ شَیْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوْهُ هَنِیْٓـًٔا مَّرِیْٓـًٔا ۟
స్త్రీలకు వారి మహార్ మూల్యాన్నితప్పనిసరిగా విధిగా చెల్లించండి,ఒకవేళ వారు తమకోసం మరేదైనా వస్తువును బలవంతం లేకుండా మీకోసం తృప్తి చెందితే అలాంటప్పుడు మీరు హలాలును నిరబ్యంతరంగా తినండి,అందులో మొహమాటపడకండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَلَا تُؤْتُوا السُّفَهَآءَ اَمْوَالَكُمُ الَّتِیْ جَعَلَ اللّٰهُ لَكُمْ قِیٰمًا وَّارْزُقُوْهُمْ فِیْهَا وَاكْسُوْهُمْ وَقُوْلُوْا لَهُمْ قَوْلًا مَّعْرُوْفًا ۟
మీరు ఇవ్వవద్దు-ఓ సంరక్షకులారా-డబ్బును ఉత్తమంగా వినియోగించడం రాకపోతే ,ఈ సంపదలను అల్లాహ్ ఒక కారణంగా చేశాడు వీటి ద్వారా దాసుల ప్రయోజనాలు మరియు వారి జీవిత వ్యవహారాలు కొనసాగుతాయి,కాబట్టి ఇలాంటి వారు సంపద మరియు దాని సంరక్షణకై అర్హులు కారు,వారిపై ఖర్చుచేయండి మరియు అందులో నుంచి వస్త్రధారణ చేయండి,మరియు వారితో మృదువుగా సంభాషించండి,మరియు మంచిగా ఉపదేశిస్తూ వారు వివేకానికి చేరుకోగానే,ఖర్చు చేసే తెలివి రాగానే ఇస్తాము అని చెప్పండి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَابْتَلُوا الْیَتٰمٰی حَتّٰۤی اِذَا بَلَغُوا النِّكَاحَ ۚ— فَاِنْ اٰنَسْتُمْ مِّنْهُمْ رُشْدًا فَادْفَعُوْۤا اِلَیْهِمْ اَمْوَالَهُمْ ۚ— وَلَا تَاْكُلُوْهَاۤ اِسْرَافًا وَّبِدَارًا اَنْ یَّكْبَرُوْا ؕ— وَمَنْ كَانَ غَنِیًّا فَلْیَسْتَعْفِفْ ۚ— وَمَنْ كَانَ فَقِیْرًا فَلْیَاْكُلْ بِالْمَعْرُوْفِ ؕ— فَاِذَا دَفَعْتُمْ اِلَیْهِمْ اَمْوَالَهُمْ فَاَشْهِدُوْا عَلَیْهِمْ ؕ— وَكَفٰی بِاللّٰهِ حَسِیْبًا ۟
ఓ అనాధాల -సంరక్షకులారా-వారు ప్రాజ్ఞ వయస్సుకు చేరిన తరువాత వారి డబ్బులోంచి కొంతభాగాన్ని పరీక్ష నిమిత్తం వినియోగించడానికి ఇవ్వండి ఒకవేళ వారు దాన్ని ఉత్తమంగా ఉపయోగించినట్లైతే వారి తెలివి,వివేకాలు మీకు అర్ధమైనట్లైతే అలాంటివారి పూర్తి సంపదను ఏ మాత్రం తగ్గించకుండా వారికి అప్పచెప్పండి,అల్లాహ్ మీకు వారి డబ్బులో అవసరార్ధం అనుమతిచ్చిన దాన్ని మినహాయించి హద్దుమీరీ తినకండి,ప్రాజ్ఞ వయసుకు రాగానే వారు దాన్ని తీసుకుంటారన్న భయంతో తినడంలో మితిమీరకండి,మీలో ఎవరైతే డబ్బు అవసరం లేని ధనికులు ఉన్నారో వారు అనాధల సొమ్మును తినకండి,మరెవరైతే మీలో డబ్బులేని పేదవాడుగా ఉంటాడో అవసరానికి సరిపోయేంత తినండి,మీరు వారికి యుక్తవయస్సుకు వచ్చాక మరియు వారి తెలివితేటలు మీ ముందు స్పష్టమయ్యాక డబ్బు అప్పచెప్పండి అలా అప్పగించేటప్పుడు హక్కులను పరిరక్షించేందుకు,మరియు విభేదాలు ఏర్పడకుండా సాక్ష్యులను దానిపై నియమించండి,అల్లాహ్’యే దానికి సాక్షిగా మరియు దాసుల కార్యాలకు లెక్కచూసేందుకు సరిపోతాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الأصل الذي يرجع إليه البشر واحد، فالواجب عليهم أن يتقوا ربهم الذي خلقهم، وأن يرحم بعضهم بعضًا.
సమస్త మానవజాతి యొక్క మూలకేంద్రం ఒకటే,కాబట్టి సృష్టించిన ప్రభువుకు భయభీతి కలిగిఉండటం వారిపై విధి,అలాగే ఒకరిపై మరొకరు దయచూపుతూ మెలగాలి.

• أوصى الله تعالى بالإحسان إلى الضعفة من النساء واليتامى، بأن تكون المعاملة معهم بين العدل والفضل.
బలహీనులైన స్త్రీలు మరియు అనాథల పట్ల దయతో ఉత్తమంగా వ్యవహరించాలని,దయతో న్యాయంగా వ్యవహరించాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆజ్ఞాపించాడు.

• جواز تعدد الزوجات إلى أربع نساء، بشرط العدل بينهن، والقدرة على القيام بما يجب لهن.
కేవలం నలుగురి భార్యల బహుభార్యత్వాన్ని అనుమతిస్తూ వారిమధ్య న్యాయబద్దంగా ఉండాలని మరియు వారికి కావలిసిన విధిగల అవసరాలను పూర్తిచేయగల శక్తి కలిగి ఉండాలని షరత్తు పెట్టడం జరిగింది.

• مشروعية الحَجْر على السفيه الذي لا يحسن التصرف، لمصلحته، وحفظًا للمال الذي تقوم به مصالح الدنيا من الضياع.
డబ్బును ఉత్తమంగా వినియోగించలేని ‘మూర్ఖుడి’ పై హజర్ ను ప్రాపంచిక అవసరాలను తీర్చే డబ్బు వృధా కాకుండా రక్షించడానికి’ ప్రయోజనం దృష్ట్యాఅమలుపర్చడం షరీఅతు సమ్మతించిన విషయం.

 
የይዘት ትርጉም ምዕራፍ: አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት