Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (275) ምዕራፍ: አል-በቀራህ
اَلَّذِیْنَ یَاْكُلُوْنَ الرِّبٰوا لَا یَقُوْمُوْنَ اِلَّا كَمَا یَقُوْمُ الَّذِیْ یَتَخَبَّطُهُ الشَّیْطٰنُ مِنَ الْمَسِّ ؕ— ذٰلِكَ بِاَنَّهُمْ قَالُوْۤا اِنَّمَا الْبَیْعُ مِثْلُ الرِّبٰوا ۘ— وَاَحَلَّ اللّٰهُ الْبَیْعَ وَحَرَّمَ الرِّبٰوا ؕ— فَمَنْ جَآءَهٗ مَوْعِظَةٌ مِّنْ رَّبِّهٖ فَانْتَهٰی فَلَهٗ مَا سَلَفَ ؕ— وَاَمْرُهٗۤ اِلَی اللّٰهِ ؕ— وَمَنْ عَادَ فَاُولٰٓىِٕكَ اَصْحٰبُ النَّارِ ۚ— هُمْ فِیْهَا خٰلِدُوْنَ ۟
వడ్డీ తిన్నవారు పునరుత్థాన దినాన వారి సమాధుల నుండి షైతానుచే ప్రభావితమైన వ్యక్తి మాదిరిగా పైకి లేస్తారు: వారు తమ సమాధుల నుండి లేచి నిలబడతారు. మరియు వెంటనే మూర్ఛరోగానికి గురైన వ్యక్తి వలే పడిపోతారు. ఎందుకంటే వారు వడ్డీని అనుమతించారు. ఇంకా, వడ్డీలు మరియు అల్లాహ్ అనుమతించిన క్రయవిక్రయాల ద్వారా సంపాదించిన లాభాల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్నీ చూపలేదు. అంతటితో ఆగక వారు 'క్రయవిక్రయం కూడా వడ్డీ లాంటిదే' అంటే రెండూ సంపద పెరుగుదల వైపుకు దారితీస్తూ ఉండటం వలన రెండూ చట్టబద్ధమైనవే అని వాదించారు. అల్లాహ్ వారి పోలికను తీవ్రంగా ఖండించాడు. వస్తువుల క్రయవిక్రయాల వ్యాపారంలో ఉన్న సాధారణ మరియు నిర్దిష్ట ప్రయోజనాల కారణంగా వాటిని అనుమతించానని మరియు ప్రజల సంపదను వడ్డీ వ్యాపారం అన్యాయంగా కొల్లగొడుతున్నందున మరియు దుర్వినియోగం చేస్తున్నందున తాను దానిని నిషేధించానని స్పష్టం చేశాడు. ఎవరైతే వడ్డీ పై అల్లాహ్ యొక్క నిషేధాజ్ఞలు మరియు వడ్డీ తినేవారికి వ్యతిరేకంగా అల్లాహ్ ప్రకటించిన తీవ్రమైన హెచ్చరికల గురించి తెలుసుకున్న వెంటనే వడ్డీ తీసుకోవడం ఆపి వేసి, తాను పాల్పడిన పాపకార్యానికి పశ్చాత్తాప పడతారో, అలాంటి వారు తాము అంతకు ముందు సంపాదించిన వడ్డీ సొమ్మును తమ దగ్గర ఉంచు కోవడంలో ఎలాంటి దోషమూ లేదు. అయితే, అప్పటి నుండి అతను ఏమి చేసినా, అల్లాహ్ దానిని లెక్కలోనికి తీసుకుని, దానిపై తీర్పునిస్తాడు.ఎవరైతే వడ్డీ తీసుకోవడం నిషేధం అని తెలిసిన తర్వాత కూడా వడ్డీ తీసుకోవడం కొనసాగిస్తారో, వారిని అల్లాహ్ నరకాగ్నిలో పడవేస్తాడు మరియు అక్కడ వారు శాశ్వతంగా పడి ఉంటారు. ఎవరైతే అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించి కూడా వడ్డీ తీసుకున్న వారికి (ముస్లింలకు) సంబంధించి ‘శాశ్వతంగా నరకాగ్నిలో పడి ఉంటారనేది’ వారు సుదీర్ఘ కాలం వరకు నరకాగ్నిలో పడి ఉంటారని సూచిస్తుంది; ఎందుకంటే కేవలం అవిశ్వాసులు మాత్రమే నరకాగ్నిలో శాశ్వతంగా పడి ఉంటారు. ఏకదైవ విశ్వాసం కలవారు అందులో శాస్వతంగా ఉండరు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• من أعظم الكبائر أكل الربا، ولهذا توعد الله تعالى آكله بالحرب وبالمحق في الدنيا والتخبط في الآخرة.
అత్యంత తీవ్రమైన ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం వడ్డీ తినడం. ఈ కారణంగా, అల్లాహ్ వడ్డీ తినే వాడిని యుద్ధానికి,ఇహలోకంలో నష్టానికి మరియు పరలోకంలో గందరగోళానికి గురి కావడానికి తయారుగా ఉండమని హెచ్చరించాడు.

• الالتزام بأحكام الشرع في المعاملات المالية ينزل البركة والنماء فيها.
వ్యాపార లావాదేవీలలో పవిత్ర షరీఅహ్ చట్టాన్ని అనుసరిస్తే, అల్లాహ్ యొక్క ఆశీర్వాదం మరియు వృద్ధి లభిస్తుంది.

• فضل الصبر على المعسر، والتخفيف عنه بالتصدق عليه ببعض الدَّين أو كله.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిపై సహనం చూపడం మరియు అతనికి ఇచ్చిన అప్పును పాక్షికంగా లేదా పూర్తిగా క్షమించడం ద్వారా అతనికి సౌలభ్యాన్ని కలగ జేయడం అనేది ఒక ఉత్తమమైన ఆచరణ.

 
የይዘት ትርጉም አንቀጽ: (275) ምዕራፍ: አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት