Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (20) ምዕራፍ: አል-በቀራህ
یَكَادُ الْبَرْقُ یَخْطَفُ اَبْصَارَهُمْ ؕ— كُلَّمَاۤ اَضَآءَ لَهُمْ مَّشَوْا فِیْهِ ۙۗ— وَاِذَاۤ اَظْلَمَ عَلَیْهِمْ قَامُوْا ؕ— وَلَوْ شَآءَ اللّٰهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَاَبْصَارِهِمْ ؕ— اِنَّ اللّٰهَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟۠
పిడుగు తన తీవ్రమైన మెరుపు,కాంతిలతో వారి చూపులను తీసుకుపోవుటకు సమీపమవుతున్నది.ఉరుము వారి కొరకు మెరిసి,కాంతినిచ్చినప్పుడల్లా ముందడుగు వేస్తున్నారు,అది కాంతినివ్వనప్పుడు అంధకారంలోనే మిగిలిపోతున్నారు. అప్పుడు వారు కదలలేకపోతున్నారు . ఒకవేళ అల్లాహే అనుకుంటే వారి సత్యతిరస్కరణ కారణంగా ఏదైనాచేయగల తన సంపూర్ణ సామర్ధ్యంతో వారి వినికిడిని, చూపునూ పోగోట్టేవాడు. అవి ఎన్నటీకీ వారివైపు తిరిగి రాగలిగేవికావు. కాబట్టి (ఇందులో ప్రస్తావించబడిన) వర్షపు ఉపమానం దివ్యఖుర్ఆన్ ను పోలినది. మరియు ఉరుముల శబ్ధాలు ఈ గ్రంధంలో ప్రస్తావించబడిన హెచ్చరికలను పోలినవి. మరియు మెరుపుల వెలుతురు యొక్క ఉపమానం అప్పుడప్పుడు వారి ముందు ప్రస్తుటమవుతున్న సత్యమును పోలినది. వారు ఉరుముల శబ్ధాలకు తమ చెవులను మూసుకోవటం యొక్క ఉపమానం సత్యం పట్ల వారి విముఖత చూపటం మరియు స్వీకరించకపోవటం వంటిది. కపటులకు ఈ రెండు ఉపమాల వారి మధ్య పోలిక ప్రయోజనం పొందకపోవటమే.నిప్పుకు సంబంధించిన ఉపమానంలో నిప్పును రాజేసేవాడు చీకటి,కాల్చటం తప్ప ఏ విధమైన ప్రయోజనం చెందలేకపోయడు. మరియు నీటి ఉపమానంలో వర్షం కురిపింప జేయబడిన వారు ఉరుముల మెరుపుల వలన భయం మరియు ఆందోళనను తప్ప మరే ప్రయోజనాన్ని పోందలేకపోయారు. ఈ విధంగా కపటవిశ్వాసులు ఇస్లాంలో కఠినత్వాన్ని, మరియు కష్టతరాన్ని తప్ప మరేమీ చూడలేక పోతున్నారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أن الله تعالى يخذل المنافقين في أشد أحوالهم حاجة وأكثرها شدة؛ جزاء نفاقهم وإعراضهم عن الهدى.
నిశ్చయంగా అల్లాహ్ కపట విశ్వాసులను – వారి కపటత్వానికి ప్రతిఫలంగా, మరియు ఋజుమార్గం పట్ల వారి విముఖతకు బదులుగా – వారి క్లిష్టతర విషయాలలో వారిని భంగపాటుకు గురిచేస్తాడు.

• من أعظم الأدلة على وجوب إفراد الله بالعبادة أنه تعالى هو الذي خلق لنا ما في الكون وجعله مسخَّرًا لنا.
ఆరాధనలలో ఒక్క అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట విధి అనుటకు గొప్ప రుజువులలో ఒకటి - ఆయనే ఈ సర్వ సృష్ఠిలో ఉన్నదానినంతా సృష్ఠించాడు మరియు దానిని మన కొరకు ఉపయుక్తంగా మలచాడు.

• عجز الخلق عن الإتيان بمثل سورة من القرآن الكريم يدل على أنه تنزيل من حكيم عليم.
ఖుర్ఆన్ గ్రంధాన్ని పోలినటువంటి ఒక్క సూరహ్ నైనా రచించ లేకపోయిన సృష్టి యొక్క అసమర్ధత ఈ గ్రంధం మహావివేకి మరియు సర్వజ్నుడైన అల్లాహ్ చే అవతరింప జేయబడినదని రుజువు చేస్తున్నది.

 
የይዘት ትርጉም አንቀጽ: (20) ምዕራፍ: አል-በቀራህ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት