Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል ከህፍ   አንቀጽ:
وَاِذِ اعْتَزَلْتُمُوْهُمْ وَمَا یَعْبُدُوْنَ اِلَّا اللّٰهَ فَاْوٗۤا اِلَی الْكَهْفِ یَنْشُرْ لَكُمْ رَبُّكُمْ مِّنْ رَّحْمَتِهٖ وَیُهَیِّئْ لَكُمْ مِّنْ اَمْرِكُمْ مِّرْفَقًا ۟
మీరు మీ జాతి వారి నుండి దూరమై,వారు అల్లాహ్ ను వదిలి ఆరాధించే వాటిని వదిలి, కేవలం ఒక్కడైన ఆ అల్లాహ్ ను మాత్రమే ఆరాధించినప్పుడు మీరు మీ ధర్మం కోసం పారిపోయి గుహలో శరణు తీసుకోండి. పరిశుద్ధుడైన మీ ప్రభువు మీ శతృవుల నుండి మిమ్మల్ని రక్షించే,మిమ్మల్ని కాపాడే తన కారుణ్యమును మీ కొరకు విస్తరింపజేస్తాడు. మరియు మీ కొరకు మీ జాతి వారి మధ్య జీవితమునకు బదులుగా మీరు ప్రయోజనం చెందే మీ వ్యవహారమును సులభతరం చేస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَتَرَی الشَّمْسَ اِذَا طَلَعَتْ تَّزٰوَرُ عَنْ كَهْفِهِمْ ذَاتَ الْیَمِیْنِ وَاِذَا غَرَبَتْ تَّقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِیْ فَجْوَةٍ مِّنْهُ ؕ— ذٰلِكَ مِنْ اٰیٰتِ اللّٰهِ ؕ— مَنْ یَّهْدِ اللّٰهُ فَهُوَ الْمُهْتَدِ ۚ— وَمَنْ یُّضْلِلْ فَلَنْ تَجِدَ لَهٗ وَلِیًّا مُّرْشِدًا ۟۠
అప్పుడు వారు తమకు ఇచ్చిన ఆదేశములను పాటించారు.అల్లాహ్ వారిపై నిదురను కలిగించాడు. మరియు వారిని వారి శతృవుల నుండి రక్షించాడు. ఓ చూసేవాడా నీవు చూస్తావు వారి కొరకు సూర్యుడు తన ఉదయించే చోటు నుండి ఉదయించేటప్పుడు వారి గుహ నుండి వాలి ప్రవేశమునకు కుడి వైపు నుండి వెళ్ళిపోతున్నాడు. మరియు సూర్యాస్తమయం వద్ద సూర్యుడు అస్తమించినట్లయితే అది తన దిశను దాని ఎడమ వైపునకు మార్చి దానికి చేరకుండా ఉంటుంది. అప్పుడు వారు శాస్వత నీడలో ఉంటారు.వారికి సూర్య తాపము హాని కలిగించదు. వారు గుహ గదిలోనే వారికి అవసరమైన గాలిని పొందుతూ ఉన్నారు. వారు గుహలో శరణు తీసుకోవటం,వారికి నిదుర కలగటం,వారి నుండి సూర్యుడు దూరంగా ఉండటం,వారి స్థలము విశాలమవటం, వారి జాతి నుండి వారికి విముక్తి కలగటం ఇవన్నీ అల్లాహ్ సామర్ధ్యమును నిరూపించే అల్లాహ్ చేసిన అద్భుతాలు. అల్లాహ్ ఎవరికైతే సన్మార్గమును నోచుకునే భాగ్యమును కలిగిస్తాడో అతడే వాస్తవానికి సన్మార్గమును పొందుతాడు. ఆయన ఎవరినైతే దాని నుండి పరాభవమునకు లోను చేసి మార్గభ్రష్టతకు లోను చేస్తాడో అతడు తనకు సన్మార్గము పొందే భాగ్యమును ప్రసాధించే,దానికి మార్గ నిర్దేశకం చేసే సహాయకుడిని పొందలేడు. ఎందుకంటే సన్మార్గము అల్లాహ్ చేతిలో ఉంది. అతని చేతిలో లేదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَتَحْسَبُهُمْ اَیْقَاظًا وَّهُمْ رُقُوْدٌ ۖۗ— وَّنُقَلِّبُهُمْ ذَاتَ الْیَمِیْنِ وَذَاتَ الشِّمَالِ ۖۗ— وَكَلْبُهُمْ بَاسِطٌ ذِرَاعَیْهِ بِالْوَصِیْدِ ؕ— لَوِ اطَّلَعْتَ عَلَیْهِمْ لَوَلَّیْتَ مِنْهُمْ فِرَارًا وَّلَمُلِئْتَ مِنْهُمْ رُعْبًا ۟
ఓ వారి వైపు చూసే వాడా వారి కళ్ళు తెరుచుకుని ఉండటం వలన నీవు వారిని మేల్కొని ఉండినట్లు భావిస్తావు. వాస్తవానికి వారు నిదురపోతున్నారు. మరియు వారి శరీరములను నేల తినివేయకుండా ఉండటానికి మేము వారిని వారి నిదురలో ఒక సారి కుడి వైపునకు మరలిస్తే ఒక సారి ఎడమ వైపునకు మరల్చేవారము. మరియు వారి రక్షక కుక్క గుహ ప్రవేశం ముందట తన రెండు కాళ్లను జాపుకుని పడి ఉంది. ఒక వేళ నీవు వారిని తొంగి చూస్తే నీవు వారితో భయపడి వెను తిరిగి పారిపోతావు. మరియు నీ హృదయం వారి భయంతో నిండిపోతుంది.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَكَذٰلِكَ بَعَثْنٰهُمْ لِیَتَسَآءَلُوْا بَیْنَهُمْ ؕ— قَالَ قَآىِٕلٌ مِّنْهُمْ كَمْ لَبِثْتُمْ ؕ— قَالُوْا لَبِثْنَا یَوْمًا اَوْ بَعْضَ یَوْمٍ ؕ— قَالُوْا رَبُّكُمْ اَعْلَمُ بِمَا لَبِثْتُمْ ؕ— فَابْعَثُوْۤا اَحَدَكُمْ بِوَرِقِكُمْ هٰذِهٖۤ اِلَی الْمَدِیْنَةِ فَلْیَنْظُرْ اَیُّهَاۤ اَزْكٰی طَعَامًا فَلْیَاْتِكُمْ بِرِزْقٍ مِّنْهُ  وَلَا یُشْعِرَنَّ بِكُمْ اَحَدًا ۟
ఎలాగైతే మేము ప్రస్తావించిన మా సామర్ధ్యపు అద్భుతాలను వారిపై చేశామో సుదీర్ఘ కాలము తరువాత వారు అందులో నిదురపోతూ గడిపిన కాలము గురించి ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని నిదుర మేల్కొలిపాము. వారిలోని కొందరు ఇలా సమాధానమిచ్చారు : మేము నిదురపోతూ ఒక రోజు లేదా రోజులో కొంత సమయమో గడిపాము. వారిలో నుండి కొందరు ఎవరికైతే వారు నిదురపోతూ గడిపిన సమయం స్పష్టం కాలేదో వారు ఇలా సమాధానమిచ్చారు : మీరు నిదురపోతూ గడిపిన కాలము గురించి మీ ప్రభువుకు బాగా తెలుసు. దాని జ్ఞానమును ఆయనకే (అల్లాహ్ కే) అప్పజెప్పి మీకు అవసరమైన విషయాల్లో నిమగ్నమవ్వండి. అయితే మీరు మీలో నుండి ఒకరిని ఈ వెండి నాణెములను ఇచ్చి మా సాధారణ నగరానికి పంపండి. అతడు దాని వాసుల్లోంచి మంచి భోజనం,మంచి లబ్దిని పొందే వారు ఎవరో గమనించాలి. మరియు అతడు తన ప్రవేశ విషయంలో,తన బయటకు వచ్చే విషయంలో,తన వ్యవహరించే విషయంలో జాగ్రత్తవహించాలి,అతడు మృదు స్వభావి అయి ఉండాలి. మరియు పెద్ద నష్టం జరగకుండా ఉండటానికి మీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియజేయవద్దు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِنَّهُمْ اِنْ یَّظْهَرُوْا عَلَیْكُمْ یَرْجُمُوْكُمْ اَوْ یُعِیْدُوْكُمْ فِیْ مِلَّتِهِمْ وَلَنْ تُفْلِحُوْۤا اِذًا اَبَدًا ۟
నిశ్చయంగా మీ జాతి వారు ఒక వేళ మిమ్మల్ని గుర్తించి మీ నివాసమును తెలుసుకుంటే మిమ్మల్ని వారు రాళ్ళతో కొట్టి చంపివేస్తారు లేదా మిమ్మల్ని తమ ఆ విచలన ధర్మం వైపునకు దేనిపైనైతే మీరు అల్లాహ్ సత్య ధర్మం వైపునకు మార్గ నిర్దేశం చేసి మీపై ఉపకారం చేయక మునుపు ఉన్నారో దాని వైపునకు బలవంతాన మరల్చి వేస్తారు. ఒక వేళ మీరు దాని వైపునకు మరలితే మీరు ఎన్నటికి సాఫల్యం కారు. ఇహలోక జీవితంలో కారు,పరలోక జీవితంలో కారు. కాని మీరు అల్లాహ్ మీకు మార్గదర్శకం చేసిన సత్య ధర్మమును మీరు వదిలివేయటం వలన,ఆ విచలన ధర్మం వైపునకు మీ మరలటం వలన ఆ రెండింటిలో పెద్ద నష్టమునే చవిచూస్తారు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• من حكمة الله وقدرته أن قَلَّبهم على جنوبهم يمينًا وشمالًا بقدر ما لا تفسد الأرض أجسامهم، وهذا تعليم من الله لعباده.
వారు తమ ప్రక్కలపై కుడి వైపునకు,ఎడమ వైపునకు భూమి వారి శరీరములకు నష్టం కలిగించని పరిణామంలో మరలటం అల్లాహ్ యొక్క విజ్ఞత,ఆయన సామర్ధ్యం లోనిది. మరియు ఇది అల్లాహ్ వద్ద నుండి తన దాసులకు ఒక బోధన.

• جواز اتخاذ الكلاب للحاجة والصيد والحراسة.
అవసరం కోసం,వేట కోసం,కాపలా కోసం కుక్కలను ఏర్పాటు చేసుకోవటం సమ్మతము.

• انتفاع الإنسان بصحبة الأخيار ومخالطة الصالحين حتى لو كان أقل منهم منزلة، فقد حفظ ذكر الكلب لأنه صاحَبَ أهل الفضل.
మనిషి మంచి వ్యక్తుల సహవాసంతో,నీతిమంతులతో కలిసి ఉండటంతో లబ్ది పొందటం చివరికి వారు ఒక వేళ అతని కంటే తక్కువ స్థానం వారైన సరే. ఆయన కుక్క ప్రస్తావనను భద్రపరచాడు ఎందుకంటే అది ఉన్నతుల సహవవాసంలో ఉన్నది.

• دلت الآيات على مشروعية الوكالة، وعلى حسن السياسة والتلطف في التعامل مع الناس.
వకాలత్ యొక్క చట్టబద్ధతపై,మంచి విధానం (రాజకీయం) పై,ప్రజలతో వ్యవహరించటంలో దయపై ఆయతులు సూచిస్తున్నాయి.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል ከህፍ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት