Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: ሁድ   አንቀጽ:

హూద్

ከመዕራፉ ዓላማዎች:
تثبيت النبي والمؤمنين بقصص الأنبياء السابقين، وتشديد الوعيد للمكذبين.
పూర్వ ప్రవక్తల గాధల ద్వారా దైవప్రవక్తను మరియు విశ్వాసపరులను స్థిరపరచటం మరియు సత్యతిరస్కారులను బెదిరించటం.

الٓرٰ ۫— كِتٰبٌ اُحْكِمَتْ اٰیٰتُهٗ ثُمَّ فُصِّلَتْ مِنْ لَّدُنْ حَكِیْمٍ خَبِیْرٍ ۟ۙ
{అలిఫ్-లామ్-రా } సూరతుల్ బఖరా ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.ఖుర్ఆన్ దాని వాఖ్యాలు క్రమములో,అర్ధములో ప్రావీణ్యం కలిగిన గ్రంధం.మీరు అందులో ఎటువంటి వ్యత్యాసము కాని లోపము కాని చూడరు.ఆ తరువాత అవి తన పర్యాలోచనలో,తన ధర్మశాసనాల్లో వివేకవంతుడి తరపు నుండి,తన దాసుల స్థితులను,వారికి సంస్కరించే వాటిని తెలిసిన వాడి తరపు నుండి హలాల్,హరామ్,ఆదేశము,వారింపు,వాగ్దానము,హెచ్చరిక,గాధలు,ఇతర విషయాల ప్రస్తావన ద్వారా స్పష్టపరచబడినవి.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ— اِنَّنِیْ لَكُمْ مِّنْهُ نَذِیْرٌ وَّبَشِیْرٌ ۟ۙ
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడిన ఈ ఆయతుల అంశము దాసులను అల్లాహ్ తోపాటు ఇతరులను ఆరాధించటం నుండి వారించటం.ఓ ప్రజలారా ఒక వేళ మీరు అల్లాహ్ ను అవిశ్వసించి ఆయనకు అవిధేయతకు పాల్పడితే నిశ్చ
యంగా నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టే వాడిని.ఒక వేళ మీరు ఆయన పై విశ్వాసమును కనబరచి ఆయన ధర్మమము ప్రకారము ఆచరిస్తే మీకు శుభవార్త తెలిపే వాడిని.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَّاَنِ اسْتَغْفِرُوْا رَبَّكُمْ ثُمَّ تُوْبُوْۤا اِلَیْهِ یُمَتِّعْكُمْ مَّتَاعًا حَسَنًا اِلٰۤی اَجَلٍ مُّسَمًّی وَّیُؤْتِ كُلَّ ذِیْ فَضْلٍ فَضْلَهٗ ؕ— وَاِنْ تَوَلَّوْا فَاِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ كَبِیْرٍ ۟
ఓ ప్రజలారా మీరు మీ ప్రభువుతో మీ పాపముల కొరకు మన్నింపును వేడుకోండి.మరియు ఆయన విషయంలో మీ ద్వారా జరిగిన లోపము పై పశ్చాత్తాప్పడుతూ ఆయన వైపునకు మరలండి బదులుగా ఆయన మీ పరిమిత వయస్సులు ముగిసే సమయం వరకు మీ ఇహలోక జీవితంలో మీకు ఆయన మంచి సుఖసంతోషాలను ప్రసాధిస్తాడు,మరియు విధేయతను,ఆచరణను ఎక్కువగా చేసే ప్రతి వ్యక్తికి ఎటువంటి తగ్గుదల లేకుండా పూర్తిగా ఆయన ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.ఒక వేళ మీరు నేను నా ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి విముఖత చూపితే నిశ్చయంగా నేను మీ పై భయానక పరిస్థితులు కల దినము యొక్క శిక్ష గురించి భయపడుతున్నాను.అది ప్రళయ దినము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اِلَی اللّٰهِ مَرْجِعُكُمْ ۚ— وَهُوَ عَلٰی كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۟
ఓ ప్రజలారా ప్రళయదినాన మీ మరలటం ఒక్కడైన అల్లాహ్ వైపునే ఉంటుంది.మరియు పరిశుద్ధుడైన ఆయన ప్రతీ దానిపై సామర్ధ్యం కలవాడు.ఏ వస్తువూ కూడా ఆయన్ను అశక్తుడిని చేయదు.అయితే మీ మరణం,మీ మరల లేపబడటం తరువాత మిమ్మల్ని జీవింప చేయటం,మీ లెక్క తీసుకోవటం ఆయనను అశక్తుడిని చేయదు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
اَلَاۤ اِنَّهُمْ یَثْنُوْنَ صُدُوْرَهُمْ لِیَسْتَخْفُوْا مِنْهُ ؕ— اَلَا حِیْنَ یَسْتَغْشُوْنَ ثِیَابَهُمْ ۙ— یَعْلَمُ مَا یُسِرُّوْنَ وَمَا یُعْلِنُوْنَ ۚ— اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ ۟
వినండి నిశ్చయంగా ఈ ముష్రికులందరూ అల్లాహ్ గురించి వారి అజ్ఞానం వలన అల్లాహ్ గురించి వారి హృదయముల్లో ఉన్న సందేహమును వారు దాయటానికి తమ హృదయములను మరలిస్తున్నారు.వినండి వారు తమ తలలను తమ దుప్పట్లతో కప్పుకున్నప్పుడు అల్లాహ్ వారు దాచిన వాటిని,బహిర్గతం చేసేవాటిని తెలుసుకుంటాడు.నిశ్చయంగా ఆయన హృదయములు దాచే వాటిని తెలుసుకుంటాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• إن الخير والشر والنفع والضر بيد الله دون ما سواه.
నిశ్చయంగా మంచి,చెడుమరియు లాభము,నష్టము అల్లాహ్ తప్ప ఇంకొకరి చేతిలో లేదు.

• وجوب اتباع الكتاب والسُّنَّة والصبر على الأذى وانتظار الفرج من الله.
గ్రంధం (ఖుర్ఆన్),దైవ ప్రవక్త విధానము ను అనుసరించటం,బాధలపై సహనం పాఠించటం,అల్లాహ్ తరపు నుండి ఉపశమనం కోసం నిరీక్షించటం తప్పనిసరి.

• آيات القرآن محكمة لا يوجد فيها خلل ولا باطل، وقد فُصِّلت الأحكام فيها تفصيلًا تامَّا.
ఖుర్ఆన్ ఆయతులు నిర్ధుష్టమైనవి.వాటిలో వ్యత్యాసము కాని అసత్యము కాని లభించదు.నిశ్చయంగా వాటిలో ఆదేశాలు సంపూర్ణంగా వివరించబడ్డాయి.

• وجوب المسارعة إلى التوبة والندم على الذنوب لنيل المطلوب والنجاة من المرهوب.
కోరుకున్న దాన్ని పొందటానికి,భయాందోళన నుండి విముక్తి పొందటానికి మన్నింపు వేడుకోవటం,పాపములపై పశ్చాత్తాప్పడటం వైపునకు త్వరపడటం తప్పనిసరి.

 
የይዘት ትርጉም ምዕራፍ: ሁድ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት